శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో నిత్యోత్సవాలనుంచి సంవత్సరోత్సవాల వరకు కన్నుల పండుగగా కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవ జరుగును. ధర్మవరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి నిత్య కైకర్యాలు మాసోస్తావాలు సంవత్సరం ఉత్సవాలు ఆగముక్త విధి విధాన పూర్వకంగా కొనసాగుతాయి. అన్ని శ్రీ వైష్ణవ పర్వదినాలు ఈ క్షేత్రంలో వైభవంగా వర్ధిల్లుతాయి.
ప్రతి సంవత్సరం ధనుర్మాస వేడుకలు గోదాదేవి ఆరాధనలు తిరునక్షత్రాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం వైశాక శుద్ధ సప్తమి నుండి బహుళ విధియ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి నాడు ధ్వజారోహణం నిర్వహిస్తారు ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ వేడుక కమనీయం గా జరుగును. త్రయోదశి నాడు శ్రీవారి నగరోత్సవం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలు నగరోత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కరుణాకటాక్షాలు పాత్రులు అవుతారు.
బ్రహ్మోత్సవాలు దేవాలయమంతా విద్యుత్ దీపాలతో కాంతులతో వెలుగొందుతుంది. వివిధ ఉత్సవ పరంపరలతో ఈ వేడుకలు సమాహారం ఆశాంతం శోభాయమానం