Image Not Found

ఓం కేశవాయ నమః

కేశవ నామం త్రిమూర్తులకు పర్యాయపదం

స్వామి శిరస్సు పైన అర్థ చంద్రా కృతిలో దశావతారాల చిహ్నాలు ఉంటాయి.  స్వామి వక్షస్థలలో లక్ష్మీదేవి హృదయీస్వరిగా విరాజిల్లుతోంది.  స్వామి విగ్రహ పాదపీఠ సమక్షంలో ఇరువైపులా శ్రీదేవి భూదేవి మూర్తులు ఉంటాయి.  ఒకే మూర్తులు స్వామి నిజరూపం దశావతారాలు వ్యూహ లక్ష్మి ఇరుదేవేర్లు ఉండటం ఈ చెన్నకేశవ స్వామి విగ్రహ కృతి ప్రత్యేకత. 

ఈ మూర్తి కి సమీపంలో స్వామివారి భారీ పాదుకలు ఉంటాయి. భక్తులు ఈ పాదుకలకు నమస్కరించి ప్రణమిల్లుతారు. ఆలయ ప్రాంగణంలో ఉండే రావి చెట్టు కింద సుబ్రమణ్య స్వామి సర్పాకృతిలో నెలకొని ఉంటాడు. విష్ణువు విరాట్ తత్వానికి ప్రతీక చెన్నకేశవస్వరూపం విష్ణువు పరిపూర్ణ యశస్సు శ్రీహరి సకల తేజస్సు చెన్నకేశవ రూపంలో అభివ్యక్తమౌతుంది. అలాంటి స్వామిని మనసారా సేవించుకొని భక్తులు స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రులు అవుతారు. గర్భాలయంలో చెన్నకేశవ స్వామి సాక్షాత్తు నారాయణ స్వరూపునిగా విరాజిల్లుతున్నాడు. గదాయుద దారిగా దండాన్ని చేతబూని శంకు చక్రాన్ని చేత దాల్చి తులసి మాల అలంకృతుడైన చెన్నకేశవ స్వామి తేజరిల్లుతాడు. సంపూర్ణ రజత కవచాలాలంకృతంగా స్వామి జగదేక మోహన మూర్తిగా భక్తుల ముంగిట ప్రకటితమౌతాడు.

లక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయం ఇక్కడ ఆవిర్భవించడానికి ఎన్నో కథనాల్ని నేపథ్యంగా ప్రస్తావిస్తారు. మహాభారతంలో శ్రీకృష్ణుడే స్వయంగా తనని కేశవుడు అని చెప్పుకున్నాడు. విష్ణువుని అంశులు అనగా కిరణాలు ప్రకాశిస్తున్నాయో వారికి కేశములు అని పేరు. అలాంటి కేశములు కలవాడు కాబట్టి కేశవుడని సర్వజ్ఞులు వ్యవహరిస్తున్నారు. శ్రీ చెన్నకేశవ స్వామి దివ్య మంగళ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తిగా ఈ మూర్తి సాలగ్రామ శిలాశోభితం. స్వామి శిరస్సు పైన అర్థ చంద్రా కృతిలో దశావతారాల చిహ్నాలు ఉంటాయి. స్వామి వక్షస్థలలో లక్ష్మీదేవి హృదయీస్వరిగా విరాజిల్లుతోంది. స్వామి విగ్రహ పాదపీఠ సమక్షంలో ఇరువైపులా శ్రీదేవి భూదేవి మూర్తులు ఉంటాయి. ఒకే మూర్తులు స్వామి నిజరూపం దశావతారాలు వ్యూహ లక్ష్మి ఇరుదేవేర్లు ఉండటం ఈ చెన్నకేశవ స్వామి విగ్రహ కృతి ప్రత్యేకత.

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేసుర పూజితే శంఖచక్రగదాహస్తే

మహాలక్ష్మీ నమోస్తుతే

లక్ష్మీదేవి ఇహపర సంపదని అనుగ్రహించి దివ్య మాత. ఇరువైపులా భారీ గజరాజు మూర్తులు అమ్మవారిని సేవిస్తుండగా లక్ష్మీదేవి భువన మోహనంగా సర్వాలంకార యుక్తంగా దర్శనమిస్తుంది. భక్తుల సహేతుకమైన కోరికలన్నీ ఈ జగన్మాత నెరవేరుస్తుంది. అమ్మవారి ముంగిట ఉన్న శ్రీ చక్ర మేరుకు నిత్య కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సంభాకృతిపై శ్రీ చక్ర ఆకృతి నెలకొని ఉంటుంది. ఈ ఆకృతిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భక్తులు భావిస్తారు.

  • శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో లక్ష్మీదేవి ప్రత్యేక ఆలయంలో సర్వాభీష్టప్రదాయినిగా వర్ధిల్లుతోంది. గజలక్ష్మి దేవిగా స్థితికారిణిగా ఐశ్వర్య అనుగ్రహకారిణిగా మహాలక్ష్మి దేవి సకల కళలతో విరాజిల్లుతోంది.

Sri%20Lakshmi%20Chennakeshava%20Swamy%20Temple

భక్తుల మాట

Images courtesy: Google