ఓం
కేశవాయ నమః
ప్రపంచానికి ఆధారమైన పూర్ణ స్వరూపం పురుషోత్తముడే వైకుంఠ నిలయుడైన శ్రీ మహా విష్ణువు.
గత 1000 సంవత్సరాలుగా ఈ ఆలయం కొనసాగుతోంది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయ్. లక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయం ఇక్కడ ఆవిర్భవించడానికి ఎన్నో కథనాల్ని నేపథ్యంగా ప్రస్తావిస్తారు. లక్ష్మీదేవి ఇహపర సంపదని అనుగ్రహించి దివ్య మాత. ఇరువైపులా భారీ గజరాజు మూర్తులు అమ్మవారిని సేవిస్తుండగా లక్ష్మీదేవి భువన మోహనంగా సర్వాలంకార యుక్తంగా దర్శనమిస్తుంది. భక్తుల సహేతుకమైన కోరికలన్నీ ఈ జగన్మాత నెరవేరుస్తుంది. అమ్మవారి ముంగిట ఉన్న శ్రీ చక్ర మేరుకు నిత్య కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సంభాకృతిపై శ్రీ చక్ర ఆకృతి నెలకొని ఉంటుంది. ఈ ఆకృతిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భక్తులు భావిస్తారు.